Keerthi Suresh: సమంత వల్లే నాకు బేబీ జాన్ లో అవకాశం వచ్చింది..! 5 d ago
స్టార్ హీరోయిన్ సమంత వల్ల తనకు "బేబీ జాన్" మూవీ లో అవకాశం వచ్చిందని నటి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కీర్తి మాట్లాడుతూ "ఈ సినిమాకు సమంత తనని రిఫర్ చేసిందని.. అందుకు థ్యాంక్స్ అని చెప్పారు. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తనకు చెప్పినట్లు" కీర్తి తెలిపారు. బేబీ జాన్ మూవీ "తేరి" మూవీ రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. తేరి మూవీ లో సమంత లీడ్ లో నటించారు.